వాటికి బాధలేదని మీకు తెలుసా ..? ఐతే మనుషుల మధ్య చచ్చే వరకు పోటీలు పెట్టండి
on Jan 18, 2023
.webp)
యాంకర్ రష్మీ గురించి బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయమే. ఒక పక్కన షోస్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అలాగే మూగ జీవాలకు కూడా అండగా ఉంటూ వాటికి హాని తలపెట్టేవారిని ఏకి పారేస్తూ ఉంటుంది. యానిమల్ లవర్ గా రష్మీ చేసే పోరాటం కాంట్రావర్సీలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఐతే ఆమె వాటిని చాలా లైట్ తీసుకుంటుంది. రీసెంట్ గా యాక్టర్ సంతానం మీద ట్విట్టర్ లో ఫైర్ ఐన విషయం తెలిసిందే.
ఇప్పుడు కోళ్ల కోసం ఓ డాక్టర్ పై సీరియస్ అయ్యింది రష్మీ. ఇప్పుడు ఈ విషయం ట్విట్టర్ లో పెద్ద చర్చనీయాంశం అయ్యింది. నెటిజన్స్ కి రష్మీకి మధ్యన మెసేజీల యుద్ధం కూడా జరిగింది. రీసెంట్ గా సంక్రాంతి పందెం కోళ్ల విషయంలో ఆమె ట్విట్టర్ లో ఫుల్ ఫైర్ అయ్యింది. అంతేకాదు ఆమె చేసిన ట్వీట్స్ కూడా వైరల్ అయ్యాయి. సంక్రాంతి పండగ రోజున ఒక డాక్టర్ తాను కోడి పందేల్లో గెలిచానని చెప్తూ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నాడు. ఆ డాక్టర్ పోస్ట్ చూసిన రష్మీ..దాన్ని స్క్రీన్ షాట్ తీసి.. “నీ డాక్టర్ సర్టిఫికెట్ ని తీసుకువెళ్లి మురుగ్గుంటలో పారేసేయ్..హింసను ఇలా ప్రోత్సహిస్తున్నారా ” అంటూ ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేసింది. దీంతో ట్విట్టర్ లో నెటిజన్స్ కి, రష్మీకి మధ్య వార్ స్టార్ట్ అయ్యింది. “కోడికి లేని బాధ మీకెందుకు మేడం?” అని ఓ నెటిజెన్ అనేసరికి ‘కోడికి బాధలేదని మీకు తెలుసా ? ఐతే మనుషుల మధ్య పోరాటాలు ఎందుకు పెట్టడం లేదు.. గ్లాడియేటర్ పోరాటాలు సాంప్రదాయంలో భాగమే కదా. మరి చనిపోయే వరకు మనుషులను పంపాలి కదా" అంటూ రష్మీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



